గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: మంగళవారం, 20 నవంబరు 2018 (21:10 IST)

అవకాశం వచ్చినప్పుడు Sweeto రాకపోతే MeToo, ఒక్కటిస్తే చాలంతే.. ప్రీతి జింటా

ప్రీతి జింటా అనగానే ప్రేమంటే ఇదేరా అనే చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సొట్ట బుగ్గలతో భలే అలరిస్తుంది. ఆ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజిలో దున్నేసింది. ఇకపోతే తాజాగా ఆమె బాలీవుడ్ హంగామాకు MeToo పైన ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి దుమారం రేపుతోంది. 
 
ప్రీతి జింటా మాట్లాడుతూ… " మిగతా రంగాలతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో లైంగిక దాడులు చాలా తక్కువ. కొందరు ఆరోపించిన మాత్రాన ఇండస్ట్రీపై ఆరోపణలు చేయడం బాగాలేదు. అవకాశాలు వచ్చిన సమయంలో స్వీటు అవకాశాలు రానప్పుడు మీటు, అసలు నాకు ఒక మీటూ కథ ఉంటే బావుగుండేది, దీనిపై ఎక్కువ మాట్లాడేదాన్ని.

నేను ఒక్కటంటే ఒక్క చెంప దెబ్బతో నా జోలికి ఎవ్వరూ రాలేదంతే. తేడా వస్తే లాగి ఒక్కటిచ్చుకుంటే MeTooకి అవకాశం ఎక్కడుటుంది'' అని ప్రీతి జింటా మాట్లాడిన మాటలపై దుమారం రేగింది. దీనితో తన వ్యాఖ్యలను సరిచేస్తూ తను కించపరిచేవిధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనీ, తనకు మీటూ ఉద్యమంపై గౌరవం వుందని చెప్పుకొచ్చింది.