సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:15 IST)

సమంతకు నాకు పెళ్లైపోయింది.. తాత మనవరాలిపై రేప్ చేస్తే..? చిన్మయి (వీడియో)

దక్షిణాదిన మీటూ విప్లవాన్ని తెరపైకి తెచ్చిన గాయని చిన్మయితో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నలకు చిన్మయి చాలా విషయాలు బహిర్గతం చేసింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. ఇది ప్రోమో వీడియో అయినప్పటికీ.. చిన్మయి అన్‌సెన్సార్డ్ ఇంటర్వ్యూ పేరిట క్యాప్షన్ కలిగివున్న ఈ వీడియోకు ఇప్పటిదాకా 394,626 వ్యూస్ లభించాయి. 
 
ఈ ఇంటర్వ్యూలో చిన్మయి.. టాలీవుడ్ అందాల రాశి సమంత, నాగచైతన్య, రాహుల్ రవిచంద్రన్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. అంతేగాకుండా తన వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. అలాగే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై కొన్ని మీటూ ఘటనలను వెల్లడించింది. అంతేగాకుండా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కూడా ఎత్తిచూపింది. ఈ ప్రోమో వీడియోను మీరూ ఓ లుక్కేయండి.