శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (11:08 IST)

పెద్ద హీరోలు అయితే మంచి అనుభవం వస్తుంది : మహానటి

'మహానటి' చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ చిత్రం తర్వాత కీర్తికి ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా, కుర్ర హీరోల సరసన నటించేందుకు ససేమిరా అంటోంది. చిన్న హీరోలతో సినీ ఛాన్స్ వస్తే.. కథ నచ్చలేదని సున్నితంగా తిరస్కరిస్తోంది. 
 
అదే పెద్ద హీరోతో అవకాశం వస్తే మాత్రం ఏమాత్రం వదులుకోవడం లేదు. దీనిపై కీర్తి సురేష్ తన సన్నిహితుల వద్ద స్పందిస్తూ, 'మహానటి' ద్వారా వచ్చిన పేరును చెడగొట్టుకోదలచుకోలేదని, అందుకే చిన్న చిత్రాల్లో నటించరాదని నిర్ణయించుకున్నట్టు చెప్పినట్టు సమాచారం. అదే పెద్ద హీరోల సరసన నటించడం వల్ల అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.