1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Raja Saab is a romantic horror janar with Prabhas

ప్రభాస్ తో రొమాంటిక్ హారర్ జానర్ గా రాజా సాబ్

Raja sab poster
Raja sab poster
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "రాజా సాబ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.
 
సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. "రాజా సాబ్" సినిమాను అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది.
*నటీనటులు* - ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తదితరులు
About Writer
డీవీ
తర్వాతి కథనం
నక్కిన చాలా మంచి వ్యక్తి.. ఇక వదిలేయండి ప్లీజ్... నటి అన్షు వీడియో