మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జనవరి 2025 (07:34 IST)

లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా

Kiran Abbavaram - Dil Ruba
Kiran Abbavaram - Dil Ruba
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
కనుమ శుభాకాంక్షలు చెబుతూ "దిల్ రూబా" సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్ గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే "దిల్ రూబా" రిలీజ్ తో మరింత స్పెషల్ కానుంది.
 
నటీనటులు - కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు, సినిమాటోగ్రఫీ - డానియేల్ విశ్వాస్, మ్యూజిక్ - సామ్ సీఎస్