ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (17:16 IST)

ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి : నిధి అగర్వాల్

Nidhi Aggarwal
Nidhi Aggarwal
న్యూ ఇయర్ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తోంది బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె నటించిన రెండు బిగ్ టికెట్ మూవీస్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తనను ఆడియెన్స్ కు మరింత రీచ్ చేస్తాయని నిధి అగర్వాల్ ఆశిస్తోంది.
 
రాజా సాబ్ సినిమాను మూవీ టీమ్ ఎంతో డెడికేటెడ్ గా రూపొందిస్తున్నారని, ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేనని నిధి చెబుతోంది. అలాగే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ రెండు భారీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళంలో మరికొన్ని సర్ ప్రైజింగ్ మూవీస్ ను న్యూ ఇయర్ లో అనౌన్స్ చేయనుంది నిధి అగర్వాల్.