1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Charan-Samantha's Rangasthalam clears censor, gets U/A certificate

"రంగస్థలం"కు U/A సర్టిఫికేట్ .. వర్కింగ్ స్టిల్స్ ఫోటో గ్యాలెరీ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్త

Rangasthalam
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తికాగా, సెన్సార్ బోర్డు మాత్రం ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్ట్‌లో పేర్కొంది. 
 
కాగా, ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా 'రంగస్థలం' విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విలక్షణ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది.

ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే, ఈ చిత్రం ఫోటో గ్యాలెరీ మీకోసం. 

 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అలా చేస్తే నైఫ్‌తో దాన్ని కత్తిరించేస్తానంటున్న ఉత్తరాదిభామ