మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (12:49 IST)

అలా చేస్తే నైఫ్‌తో దాన్ని కత్తిరించేస్తానంటున్న ఉత్తరాదిభామ

సినీ రంగంలో తరచూ వినిపిస్తున్న మాట కాస్టింగ్‌ కౌచ్‌. ఈ బాధితుల్లో అనేక మంది హీరోయిన్లతో పాటు హీరోలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో కొందరు ఒక్కొక్కరుగా ధైర్యం చేసి తాము ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడిస్తున్న

సినీ రంగంలో తరచూ వినిపిస్తున్న మాట కాస్టింగ్‌ కౌచ్‌. ఈ బాధితుల్లో అనేక మంది హీరోయిన్లతో పాటు హీరోలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో కొందరు ఒక్కొక్కరుగా ధైర్యం చేసి తాము ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన ఉత్తరాదిభామ శివాని సింగ్ స్పందించారు. ఏ మంత్రం వేశావే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈమె... తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత సేఫ్‌గా దీని బారి నుంచి బయటపడగలం. నేను మోడలింగ్‌ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎవరికీ అంత ఛాన్స్‌ ఇవ్వలేదు. అలాంటి వారు ఎదురుపడినా, ముఖం మీద కొట్టినట్టు మాట్లాడతాను. దాంతో నా దగ్గరకి రావడానికి భయపడేవారు. 
 
ఒక మహిళా ఆర్టిస్టు అనగానే కొందరికి చులకన భావం. అలాంటి వారే లైంగిక వేధింపులకు పాల్పడతారు. మీకో సంగతి చెబుతాను. నిర్భయ సంఘటన జరిగినప్పటి నుంచీ నా పర్సులో చిన్ననైఫ్‌ పెట్టుకుని తిరుగుతున్నాను. నా పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని పొడిచి ఆ తర్వాత మాట్లాడాలని డిసైడ్‌ అయ్యాను. మరీబలవంతం చేయాలని చూస్తే మాత్రం కత్తితో దాన్ని కత్తిరించేస్తా అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే, ఇప్పటిదాకా నాకా అవసరం రాలేదు. ఆడపిల్లలు భయంగా, బెరుకుగా కనిపిస్తే ఏడిపించేవారు మరీ రెచ్చిపోతారు. అదే తిరగబడేటట్లు కనిపిస్తే తోకముడుస్తారంటూ ఈ అమ్మడు సెలవిచ్చారు.