మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (13:36 IST)

హీరోయిన్ శ్రియా పెళ్లి వీడియో.. ఫోటోలు...

ద‌క్షిణాదిన టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ ఇపుడు ఓ ఇంటికి కోడలైంది. ర‌ష్యాకు చెందిన ఆండ్రీ కొశీవ్‌ను శ్రియ ఇటీవ‌ల అత్యంత ర‌హ‌స్యంగా తమ ఇరు కుటుంబ శభ్యుల మధ్యే పెళ్లాడింది. ఈ వివాహం ఈనెల 14వ త

ద‌క్షిణాదిన టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ ఇపుడు ఓ ఇంటికి కోడలైంది. ర‌ష్యాకు చెందిన ఆండ్రీ కొశీవ్‌ను శ్రియ ఇటీవ‌ల అత్యంత ర‌హ‌స్యంగా తమ ఇరు కుటుంబ సభ్యుల మధ్యే పెళ్లాడింది. ఈ వివాహం ఈనెల 14వ తేదీన ముంబైలో జరిగింది.
 
తాజాగా ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లి త‌ర్వాత శ్రియ సినిమాల‌కు స్వస్తి చెప్ప‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. భ‌ర్త‌తోపాటు భార‌త్‌లోనే క్రీడా ప‌రికరాల వ్యాపారం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.
 
కాగా, తెలుగుతోపాటు త‌మిళ‌, హిందీ సినిమాల్లో న‌టించింది. ద‌క్షిణాదిన అగ్రహీరోలైన ర‌జనీకాంత్‌, చిరంజీవి, నాగార్జున‌, విక్ర‌మ్ వంటి హీరోల స‌ర‌స‌న న‌టించింది. తాజాగా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి, త‌న ప్రియుడిని పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడిపోనుంది.