మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (12:37 IST)

రష్యా ప్రియుడితో ఢిల్లీ భామ శ్రియ వివాహం.. ఎపుడంటే?

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరోయిన్ శ్రియ ఓ ఇంటికి కోడలు కానుంది. తన రష్యా ప్రియుడుని ఆమె వివాహమాడనున్నారు. వీరిద్దరి వివాహం ఈనెల 12వ తేదీన జరిగినట్టు మిడే డే టాబ్లాయిడ్ ఓ కథనాన్ని ప్రచురించ

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరోయిన్ శ్రియ ఓ ఇంటికి కోడలు కానుంది. తన రష్యా ప్రియుడుని ఆమె వివాహమాడనున్నారు. వీరిద్దరి వివాహం ఈనెల 12వ తేదీన జరిగినట్టు మిడే డే టాబ్లాయిడ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం ముంబైలోని అంథేరిలోని శ్రియ నివాసంలో ఆండ్రీతో ఆమె వివాహం చాలా హడావిడిగా జరిగిపోయింది.
 
ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ఆండ్రీ-శ్రియ ఇద్దరూ పెళ్లి ప్రమాణాలు చేశారట. ఈ శుభ కార్యానికి శ్రియ పింక్ కలరు దుస్తులు ధరించినట్టు పేర్కొంది. ఈ కార్యక్రమం తర్వాత ఉదయ్‌పూర్‌లో శనివారం తదుపరి ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నట్లు 'మిడ్ డే' టాబ్లాయిడ్ తెలిపింది. 
 
ఈ  వివాహ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్యే జరిగిన ఈ వివాహంలో శ్రియ సన్నిహిత మిత్రుల్లో కొంతమంది మాత్రమే హాజరైనట్టు సమాచారం. ఇలాంటివారిలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా ఉన్నారట. అలాగే, వివాహానికి ముందు ఈ నెల 11న విందు కార్యక్రమం ధూం ధాంగా జరిగినట్టు పేర్కొంది.