శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 8 మార్చి 2018 (17:44 IST)

చుప్ బే సాలా.. నన్ను వేరే ఫ్లైట్ ఎక్కించండి.. స్పైస్ జెట్ సిబ్బందిపై విరుచుకుపడ్డ శ్రియ

ఈమధ్య హీరోయిన్లు సహనాన్ని కోల్పోతున్నారు. కోపాన్ని ఆపుకోలేకపోతున్నారు. పదిమంది ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. అలాంటి పనే చేశారు ప్రముఖ నటి శ్రియ. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు శ్రియ. తిరుప

ఈమధ్య హీరోయిన్లు సహనాన్ని కోల్పోతున్నారు. కోపాన్ని ఆపుకోలేకపోతున్నారు. పదిమంది ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. అలాంటి పనే చేశారు ప్రముఖ నటి శ్రియ. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు శ్రియ. తిరుపతిలో బస చేసి ఆ తరువాత తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న మొత్తం తిరుపతిలో ఉండి ఆ తరువాత స్పైస్ జెట్‌లో హైదరాబాద్‌కు వెళ్ళేందుకు టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. 
 
ఆ స్పైస్ జెట్ విమానం కాస్తా మరమ్మత్తులకు గురైంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌కు విమానం వెళ్ళాల్సి ఉంది. కానీ మరమ్మత్తుల కారణంగా పాత ఎయిర్‌పోర్ట్‌లో ఉంచి రిపేర్ చేయడం మొదలెట్టారు. ఐదు గంటల పాటు సహనంతో కూర్చున్న శ్రియకు కోపం కట్టలు తెంచుకుంది. 
 
స్పైస్ జెట్ సిబ్బందిని దగ్గరకు పిలిచి నన్ను వేరే ఫ్లైట్ ఎక్కించండి అంటూ గట్టిగా అరిచింది. స్పైస్ జెట్ సిబ్బంది కొద్దిసేపు వెయిట్ చేయండి.. ఫ్లైట్ మరమ్మత్తులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పే లోపే.. చుప్ బే సాలా నన్ను వేరే ఫ్లైట్ ఎక్కించండి ముందు అంటూ శ్రియ నానా  యాగీ చేసింది. దీంతో స్పైస్ జెట్ సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయారు. ఎంతసేపటికీ స్పైస్ జెట్ సిబ్బంది రాకపోవడంతో శ్రియ చేసేది లేక మధ్యాహ్నం ఒక గంట 30 నిమిషాలకు వేరే ఫ్లైట్ ఎక్కి విమానంలో వెళ్ళిపోయారు.