1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rangasthalam Director Sukumar explanation his working style

అలా చేయడం వల్ల నష్టపోతున్నానంటున్న దర్శకుడు

సాధారణంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది నానుడి. అలాగే, ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నపుడే నాలుగు రూపాయలు సంపాదించుకుని వెనుకేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు.

Rangasthalam
సాధారణంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది నానుడి. అలాగే, ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నపుడే నాలుగు రూపాయలు సంపాదించుకుని వెనుకేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇలాంటి వారిలో దర్శకులు కూడా ఉంటారు. ఒక సినిమా హిట్ అయితే, ఆ తర్వాత నాలుగైదు సినిమాలు ఒప్పేసుకుని కోట్లకు కోట్లు గడిస్తుంటారు. కానీ, ఆ దర్శకుడు మాత్రం అలా కాదు. యేడాదికి ఒక్క సినిమా తీసినా అది బాగుండాలని కోరుకుంటారు. అలాంటి దర్శకుడు సుకుమార్. 
 
ఈయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజానికి సుకుమార్ సినిమా వస్తుంది అంటే చాలు జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఆయన స్టయిల్ ఆఫ్ మేకింగ్‌కి ఎందరో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. సినిమా చేస్తున్నాడంటే ఎటువంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 
 
అలాంటి సుకుమార్.. తన వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ, 'నేను సినిమాలు తీయడానికి ఎక్కువ సమయం తీసుకుంటానని అంతా అంటుంటారు. కానీ నేను చేసిన ఏ సినిమా అయినా షూటింగ్ మొదలైన తర్వాత స్పీడ్‌గానే పూర్తవుతుంది. కాకపోతే కథ కోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటాను. కథ అంతా సిద్ధం అయ్యే సరికి టైమ్ పడుతుంది. ఆ తర్వాత షూటింగ్ మాత్రం అనుకున్న టైమ్‌లోనే పూర్తి చేస్తాను. దీనివల్ల నా నిర్మాతలకు లాభమే కానీ నష్టముండదు. మంచి కథతో సినిమా తీస్తే వారికే మంచిది కదా. కాకపోతే నష్టపోయేది నేనే. ఎందుకంటే అందరిలా ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయలేను. 'రంగస్థలం'ని సంవత్సరంలోపే పూర్తి చేశాం అని చెప్పారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా'? ప్రశ్నిస్తున్న నటి