మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (13:02 IST)

రంగస్థలం: ''ఎంత సక్కగున్నావే'' ప్రోమో మీ కోసం..

''రంగస్థలం'' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలోని రంగా రంగా రంగస్థలాన.. సాంగ్ ప్రోమో వీడియోను ఇటీవల విడుదల చేశారు. తాజాగా శుక్రవారం ఎంత సక్కగున్నావే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార

''రంగస్థలం'' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలోని రంగా రంగా రంగస్థలాన.. సాంగ్ ప్రోమో వీడియోను ఇటీవల విడుదల చేశారు. తాజాగా శుక్రవారం ఎంత సక్కగున్నావే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా మార్చి 30న విడుదల కానుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఒకవైపు సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్, సమంతలు ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు సినీ మేకర్స్ ప్రోమో వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. రంగస్థలంలో సమంత, రామ్‌చరణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించాడు.