శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (12:17 IST)

''భరత్ అనే నేను'' ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎప్పుడొస్తుందో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ''భరత్ అనే నేను'' సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం భరత్ అనే నేను ట్రెండ్ నడుస్తోంది. కొరటాల శివ, మహేష్ బాబు కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు డీవీవీ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ''భరత్ అనే నేను'' సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం భరత్ అనే నేను ట్రెండ్ నడుస్తోంది. కొరటాల శివ, మహేష్ బాబు కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా కైరా అద్వాని నటిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ఓత్, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలు పెరిగాయి. 
 
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రానుంది. మహే‌ష్‌బాబు ముఖ్యమంత్రిగా నటిస్తోన్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగ్‌ను 'శ్రీరామ నవమి' పండుగను పురస్కరించుకుని రిలీజ్ చేయనున్నారు. ఆడియో వేడుకను వచ్చేనెల 7వ తేదీన వైజాగ్‌లో భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. భరత్‌ అనే నేను నుంచి తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు. 
 
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏప్రిల్ 20వ తేదీన సినిమా విడుదల కానుంది. కాగా.. శ్రీమంతుడు సినిమాలో పుట్టిన ఊరి కోసం ఏదైనా చేయాలంటూ సోషల్ మెసేజ్ ఇచ్చిన మహేష్.. ఈ మూవీలో సొసైటీ అంటే భయం, బాధ్యత ఉండాలనే సందేశాన్నిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా కొరటాల మరో హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.