మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (11:41 IST)

సఖ్యతకీ.. సంతోషానికి.. సంబరానికి అద్దంపట్టే రంగస్థలం టైటిల్ సాంగ్ (వీడియో)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ పొందాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన 'రంగ రంగ రంగస్థలాన' అంటూ సాగే టైటిల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో కుటుంబసభ్యుల వంటి గ్రామస్థులతో కలిసి డాన్స్ చేస్తూ చరణ్ ఈ పాటలో దుమ్ము రేపేశాడు.
 
పల్లెలోని సఖ్యతకీ.. సంతోషానికి.. సంబరానికి ఈ పాట అద్దం పడుతోంది. సంగీతం.. సాహిత్యం.. నృత్యం సమపాళ్లలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దేవీశ్రీ స్వరపరిచిన ఈ బాణీ.. ఆయనకి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత, ఈ సినిమా హిట్‌పై అభిమానుల నమ్మకం మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.