శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (11:54 IST)

'రంగస్థలం' చిత్రాన్ని రీషూట్ చేయాలి.. థ్యాంక్యూ సుక్కు : రామ్ చరణ్ స్పీచ్ (Video)

హీరో రామ్ చరణ్, హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో వైజాగ్ వేదికగా ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమం జరిగింది. ఇందులో హీర

హీరో రామ్ చరణ్, హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో వైజాగ్ వేదికగా ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమం జరిగింది. ఇందులో హీరో చెర్రీతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. 
 
ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ, 'నిజంగా ఈ చిత్రంలో ఓ కొత్త చరణ్‌ని చూస్తారు. దర్శకుడు సుకుమార్‌గారు అలాంటి చరణ్‌ను పరిచయం చేశారు. చిట్టిబాబు పాత్రని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నా మీద నాకే రెస్పెక్ట్ పెరిగింది. ఇక సినిమా షూటింగ్ అయిపోయింది. మార్చి 30 తర్వాత ప్రతి రోజు సుకుమార్‌ని చూడలేనా.. అనే దిగులు పట్టుకుంది. ఆ గడ్డం కూడా ఎందుకు తీసేశానా అని అనిపిస్తుంది అని అన్నారు. 
 
'షూటింగ్‌ టైమ్‌లో అడిగేవాడిని. సంవత్సరం అయిపోయింది. గడ్డం ఎప్పుడు తీపిస్తున్నావ్ అని. కానీ మనసులో ఆ గడ్డాన్ని, లుంగీలను, యాసను ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఎంత ఎంజాయ్ చేశానో.. ఇప్పుడు ఆ పాత్రని మిస్ అవుతున్నందుకు అంతే ఫీల్ అవుతున్నాను. అవకాశం ఉంటే మళ్లీ గడ్డం పెట్టుకుని రీషూట్ చేయాలి అనిపిస్తుంది. థ్యాంక్యూ సుక్కు..' అంటూ వ్యాఖ్యానించారు. చెర్రీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.