గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (12:35 IST)

''రంగస్థలం'' పాటలో ఆ చరణం.. యాదవ మహిళలను కించపరిచేలా వుందట

''రంగస్థలం'' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ముంబై భామ మాన‌సి పాడిన‌ రంగస్థలంలోని ''రంగమ్మ మంగమ్మ... పాటలో ''గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే'' అంటూ సాగిన చరణం

''రంగస్థలం'' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ముంబై భామ మాన‌సి పాడిన‌ రంగస్థలంలోని ''రంగమ్మ మంగమ్మ... పాటలో ''గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే'' అంటూ సాగిన చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని.. వెంటనే దాన్ని తొలగించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయాధ్యక్షుడు రాములు యాదవ్ డిమాండ్ చేశారు. 
 
యాదవుల పట్ల దర్శకుడు, నిర్మాత, రచయితల‌ వైఖరి సరికాదన్నారు. పాటలోని ఆ చరణాన్ని వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని రాములు హెచ్చరించారు. ఈ హెచ్చరికపై రంగస్థలం యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
ఇకపోతే రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరోహీరోయిన్లుగా, ఆదిపినిశెట్టి, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్న రంగస్థలం సినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుంత ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్న యూనిట్... సినిమా ప్రమోషన్‌పై కూడా దృష్టి పెట్టింది.