సంబంధిత వార్తలు
- చెర్రీని చూడగానే కంగారుపడ్డా.. అలా చెప్పడం మరిచిపోయా : లావణ్య త్రిపాఠి
- #RRRలో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని..
- బడా హీరోలతో ఢీకొట్టనున్న చెర్రీ : సంక్రాంతి రేసులో ఆ మూడు చిత్రాలు
- వరుణ్ ముఖ్యంకాదు... సినిమాపై ఉన్న గౌరవంతో వచ్చా.. చెర్రీ
- చంద్రబాబు గురించి ఇక్కడ మాట్లాడనన్న పవర్ స్టార్... అది సూపర్బ్ అన్న చెర్రీ
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఈనెల 26తో పూర్తి కానుంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుంది. బోయపాటి అంటేనే ఊర మాస్.. ఇక అతనికి మాస్ హీరో జత కలిస్తే... ఆ సినిమా ఏరేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకనే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ స్ధాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే ఈవెంట్లో ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
డి.వి.వి.దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఇక చరణ్ నటించిన రంగస్థలం ఈ ఏడాది టాలీవుడ్‌లో విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది. మరి... వినయ విధేయ రామ ఎలాంటి సంచలనం సృష్టించనుందో చూడాలి.
తర్వాతి కథనం
