గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (15:16 IST)

చెర్రీని చూడగానే కంగారుపడ్డా.. అలా చెప్పడం మరిచిపోయా : లావణ్య త్రిపాఠి

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీలు జంటగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అంతరిక్షం". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, విడుదలకు ముందు చిత్రం ప్రిరిలీజ్ పంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు.
 
దీనిపై లావణ్య త్రిపాఠి స్పందించింది. "అంతరిక్షం ప్రీరిలీజ్ కార్యక్రమానికి చెర్రీ రావడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయాం. దీంతో నేను కంగారుపడిన మాట వాస్తవమే. అందువల్లే ఆ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చినందుకు చెర్రీకి ధన్యవాదాలు చెప్పటం మర్చిపోయా. వేడుకకు చరణ్ హాజరుకావడం ద్వారా మాలోని ఆత్మస్థైర్యం పెరిగింది. ఇలా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా" అంటూ ఓ ట్వీట్ చేసింది. 
 
కాగా, శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్నిఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగ‌ర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయిబాబు జాగ‌ర్లమూడిలు కలిసి సంయుక్తంగా నిర్మించారు.