1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (14:12 IST)

రెజీనా అలాంటి రోల్స్ చేసేందుకు సై అంటోంది.. తెలుసా? (video)

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా అందాలను ఆరబోసినా.. హిట్ సినిమాలు మాత్రం ఆమె ఖాతాలో పడలేదు. ఎన్ని పాత్రలు చేసిన ఈ అమ్మడికి అదృష్టం మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ప్రతి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడికి ప్రతి సినిమాలో నిరాశే ఎదురవుతుంది.

ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను నమ్ముకున్న ఈ భామ ప్రస్తుతం తాను ఎంపిక చేసుకునే పాత్రల గురించి కామెంట్స్ చేసింది. 
 
ఓ ఇంటర్వ్యూకి హాజరైన రెజినా తన మనసులో ఉన్న మాట బయట పెట్టింది. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో గ్లామర్ రోల్స్‌లో కనిపించి తన హాట్‌హాట్ అందాలతో అందరికీ చెమటలు పట్టించిన ఈ అమ్మడుకి... ఇంకా అంతకుమించిన హాట్ గర్ల్ రోల్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులో మాట చెప్పేసింది. కాగా ప్రస్తుతం నిను వీడని నీడను నేనే అనే సినిమాలో నటించడంతో పాటు చిరు సినిమాలో ఒక ఐటం సాంగ్‌లో కూడా రెజీనా కనిపించబోతోంది.