గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:15 IST)

నితిన్ పెళ్లికి అడ్డుపడుతున్న కరోనా వైరస్.. మళ్లీ వాయిదా..

తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్‌గా ఉన్న హీరో ఎవరయ్యా అని అడిగితే ఠక్కున చెప్పే సమాధానం నితిన్. ఈయన తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికి ఓ ఇంటివాడు కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ, కరోనా వైరస్ నితిన్ పెళ్ళికి అడ్డుపడిది. ఈ నల 16వ తేదీన జరగాల్సిన వివాహాన్ని మళ్లీ వాయిదా వేశారు. అన్నీ అనుకూలిస్తే మే నెలలో ఈ వివాహాన్ని జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు భావిస్తున్నారు.
 
దేశవిదేశాలతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ పెళ్లిని వాయిదా వేసుకోవ‌డ‌మే మంచిద‌ని భావించిన నితిన్ పెళ్ళిని వాయిదా వేస్తున్న‌ట్టు తాజాగా ప్రకటించారు.
 
అయితే పెళ్లిని వాయిదా వేసుకుందామ‌ని త‌నకి కాబోయే భార్య షాలినితో చెప్ప‌గా, ఆమె ఎలా రియాక్టో అయిందో ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించాడు. జీవితంలో ఒక్క‌సారి మాత్ర‌మే జ‌రిగే పెళ్లి వేడుక‌ని ఘ‌నంగా చేసుకోవాలే కాని మాస్కులు ధ‌రించి భ‌యం భ‌యంగా చేసుకోకూడ‌దు. 
 
కుటుంబ‌మంతా ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. పెళ్లి వాయిదా వేద్దామని కాబోయే భార్య‌తో చెప్ప‌గా సంతోషంగా ఓకే అనేసింద‌ని నితిన్ చెప్పుకొచ్చారు. కాగా, దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో నితిన్ త‌న పెళ్లిని డెస్టినేష‌న్ ప‌ద్ద‌తిలో జ‌రుపుకోవాల‌ని భావించిన విష‌యం తెలిసిందే.