బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (20:27 IST)

ఎనిమిదేళ్ల తర్వాతనే పెళ్లి చేసుకుంటా... రష్మిక మందన

టాలీవుడ్‌లో గీత గోవిందం సినిమా తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందనకు సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ డిమాండ్ బాగానే పెరిగిపోయింది. ప్రస్తుతం అభిమానులతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ భామ.. పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది రష్మిక మందన్న. దానికి వెంటనే సమాధానం కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
 
ప్రస్తుతానికి సినిమాలు తప్ప పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కన్ఫర్మ్ చేసింది. ప్రేమ వివాహం చేసుకుంటారా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అలాంటిదేమీ లేదు.. తన ఓటు అరేంజ్డ్ మ్యారేజ్‌కే అనేసింది. ప్రేమ పెళ్లిపై నమ్మకం లేదా అంటే నో కామెంట్స్ అనేసింది రష్మిక. 
 
కాగా.. రెండేళ్ల కింద కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకుంది రష్మిక. ఆ తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేసింది. మళ్లీ ఇప్పుడు పెళ్లి గురించి టాపిక్ వచ్చేసరికి మనసులో మాట బయటపెట్టింది. 
 
తాను పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని.. ఎనిమిది ఏళ్ల తర్వాత కానీ వివాహం చేసుకోనని రష్మిక స్పష్టం చేసింది. రష్మిక ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాతో పాటు తెలుగులో మరో మూడు సినిమాలతో బిజీగా ఉంది.