గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:17 IST)

హీరోయిన్ కోసం భార్యకు విడాకులిచ్చిన హీరో.. త్వరలో పెళ్లి...

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు ప్రేమలు, పెళ్ళిళ్ళపై పెద్దగా నమ్మకాలు ఉండవు. ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నా, లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా అది జీవితకాలం కొనసాగుతుందని చెప్పడం అనుమానమే. భార్యాభర్తల్లోని ఏ ఒక్కరిలోనైనా మనసు మారినా, తమలో ప్రేమ మళ్లీ చిగురించినా ఏమాత్రం వెుకంజ వేయకుండా మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి కోలీవుడ్ ఇండస్ట్రీలో జరిగింది. 
 
తాజాగా ఓ హీరో, తెరమరుగైన తెలుగు హీరోయిన్ కోసం తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. పైగా, తన తల్లిదండ్రులను ఒప్పించి, భార్యకు విడాకులిచ్చి, తెలుగు హీరోయిన్‌ను రెండో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తీరా కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో వారి వివాహం వాయిదా పడింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరో కృష్ణకులశేఖరన్. తమిళ చిత్రం కళగు హీరో. అడపాదడపా చిత్రాలు చేస్తుంటారు. ఆయన ఖాతాలో మంచి హిట్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈయనకు వివాహమై భార్య ఉంది. పైగా, ఈయన కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్థన్‌ సొంత సోదరుడు. 
 
అయితే, తెలుగులో వచ్చిన చిత్రం "టెన్త్ క్లాస్". ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగు హీరోయిన్ సునైన. తెలుగులో ఇక్క‌డ అవ‌కాశాలు పెద్ద‌గా రాక‌పోవ‌డంతో త‌మిళ ప‌రిశ్ర‌మ‌కి వెళ్లింది. అక్క‌డ 'పంజా' దర్శకుడైన విష్ణువర్ధన్ సోదరుడు కృష్ణ కుల‌శేక‌ర‌న్‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది 
 
నిజానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. కానీ, వారిద్దరూ ఎక్కడా బయటపడలేదు. అయితే సునైన త‌న ఇంటి స‌భ్యుల‌కు ఈ విషయం చెప్పి రెండో పెళ్లికి ఒప్పించింది. అలాగే, కృష్ణ కుల‌శేఖర‌న్‌కు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి అతని తల్లిదండ్రులు సమ్మతించకపోయినా ఏదోలా బుజ్జగించి చివరకు ఒప్పించాడట. 
 
ఫలితంగా ఏప్రిల్‌లో జ‌ర‌గాల్సిన వీరి వివాహం లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప‌రిస్థితులు అన్నీ స‌ద్దుమ‌ణిగాక ఇద్ద‌రు పెళ్లిపీట‌లెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. కృష్ణ కుల‌శేర‌న్, సునైన క‌లిసి ప‌లు త‌మిళ సినిమాల‌లో నటించ‌గా, ఇందులో కొన్ని మంచి విజ‌యం సాధించాయి.