శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (09:14 IST)

కోమాలో నటుడు నర్సింగ్ యాదవ్ - భార్య ఏమన్నారంటే...

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు. డయాలసిస్ పేషెంట్ అయిన నర్సింగ్ యాదవ్‌కు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పాటు.. బ్రెయిన్‌లో రక్తంగడ్డకట్టడంతో ఆయన కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న యశోదా ఆస్పత్రిలో చేర్చి వెంటిలేటర్‌ను అమర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
డయాలసిస్ పేషెంట్ అయిన నర్సింగ్ యాదవ్ ఏప్రిల్ 9వ తేదీన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. ఇది గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయు వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు కూడా స్పందిస్తారు. 
 
ఇదే అంశంపై ఆయన భార్య చిత్రా యాదవ్ స్పందిస్తూ, అనారోగ్యానికి గురైన తన భర్తకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. డయాలసిస్ పేషెంట్ కావడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయాలని వైద్యులు చెప్పారని తెలిపారు. 
 
అంతేకానీ, తన భర్త బాత్రూమ్‌లో జారిపడ్డారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చారు. కాగా, ఆయనకు గురువారం డయాలసిస్ చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు లోనయ్యారు.