శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:07 IST)

రోడ్లపై తిరుగుతున్న కరోనా రోగులు .. హడలిపోతున్న హిందూపురం వాసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, కర్నూలు జిల్లాలో ఈ వైరస్ మరింతగా విజృంభిస్తోంది. అలాగే, అనంతపూరం జిల్లాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదైవున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలి ఈ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కానీ, వారు ఏమాత్రం ఆస్పత్రుల్లో ఉండకుండా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆస్పత్రి చుట్టుపక్కల నివసించేవారు తీవ్రంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురంలో సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి వుంది. ఇందులో హిందూపురం ప్రాంతంలో కరోనా సోకిన కొందరిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వీరెవరూ ఇతరులను కలవరాదని, బయటకు కూడా రాకూడదని ఆసుపత్రి వర్గాలు స్పష్టంగా చెబుతున్నారు. 
 
వీరెవరూ వినే పరిస్థితిలో లేరు. వీరంతా గదుల నుంచి బయటకు వచ్చి, వారిష్టం వచ్చినట్టు విహారం చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు చెప్పినా వినడం లేదు. దీంతో వారు తమతమ గదుల నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టాలని, భద్రతను పెంచాలని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.