కరోనా వైరస్, ఈ లెక్క ఇలాగే సాగితే ఏప్రిల్ 14 నాటికి 17 వేల మందికి...
కరోనా వైరస్ గత 3 రోజుల్లో తీవ్రస్థాయిలో విజృంభించింది. ఐతే ఈ పెరుగుదలకు ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారన్నది ఓ వాదన. ఐతే ప్రస్తుతం పెరుగుతూ పోతున్న ఈ రేటు ఇలాగే సాగితే మటుకు ఏప్రిల్ 14 నాటికి ఈ సంఖ్య 17 వేలకు చేరుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా మొత్తం 4421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 354 కొత్త కేసుల నమోదు, 5 గురు మృతి. ప్రతి రెండు రోజులకు రెట్టింపు అవుతున్న “పాజిటివ్” కేసులు. ఆ లెక్కన ఏప్రిల్ 14న “లాక్ డౌన్” పూర్తయ్యే వాటికి సుమారు 17 వేల “పాజిటివ్” కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా.
అయితే, గత రెండు రోజులతో పోల్చితే తగ్గిన కొత్త కేసుల నమోదు. ఈ తగ్గుదల ఇలాగే సాగాలని అంతా కోరుకుంటున్నారు.