శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:33 IST)

కరోనా అలెర్ట్.. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం తీసుకోకపోవడం మంచిదట! (video)

కరోనా బారిన పడేవారి సంఖ్యను పరిమితం చేయడానికి ప్రజలు ఇంటి వద్దే వున్నారు. ఈ వైరస్ సోకకుండా వుండాలంటే ఇతరులకు దూరంగా వుండాలి. ఇంకా లాక్ డౌన్‌లో వున్నప్పుడు దుకాణాలు మూతపడతాయి. అందుచేత అవసరమైన సామాగ్రిని ముందే కొనిపెట్టుకోండి. ఇలా చేస్తే.. ముందు జాగ్రత్తగా వుండొచ్చు. 
 
కరోనావైరస్ (COVID-19)ను తరిమికొట్టడానికి సిద్ధమవ్వాలంటే.. ఇంట్లోనే వుండేందుకు రెడీ అవ్వాలి. ఇంకా ఇంట్లో ఉండటానికి అవసరమైన వాటిని కలిగి ఉండాలి. ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్లమని అధికారులు సూచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల కోసం అవసరమైతేనే బయటికి రావడం మంచిది. కానీ రద్దీగా వున్నప్పుడు షాపులకు వెళ్లకపోవడం మంచిది. 
 
బయటకు వెళ్ళే ముందు, తరువాత చేతులు కడుక్కోవాలి. మీరు స్టోర్స్‌లో ఉన్న సమయాన్ని పరిమితం చేయడానికి అందుబాటులో ఉన్న చోట డెలివరీ లేదా పికప్‌తో ఆన్‌లైన్ షాపింగ్ ఉపయోగించండి. డెలివరీ బాక్సులను తుడిచివేయమని లేదా వీలైతే బయట తెరిచి, ఆపై చేతులు కడుక్కోవాలి. 
 
ఆహారం-నీరు :
ఫ్రిజ్‌లో వుంచిన ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఎక్కువ సేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచని ఆహారాన్ని ఎంచుకోవాలి. అప్పటికప్పుడు తయారైన ఆహారాన్ని తీసుకోవాలి. మిగిలిన ఆహారాన్ని దూరంగా వుంచడం మంచిది. పండ్ల రసాలు, బియ్యం, ఎండిన బీన్స్, గ్రానోలా బార్లు, వేరుశెనగ, వెన్న, తృణధాన్యాలు కొనిపెట్టుకోవాలి. అవసరమైతే బేబీ ఫుడ్స్ గుర్తుంచుకుని కొనిపెట్టుకోవడం మంచిది. అలాగే పెంపుడు జంతువులు ఉంటే, వారికి కూడా అవసరమైన వాటిని నిల్వ చేయాలి. సూప్, హెల్దీ క్రాకర్స్ వంటికి తీసుకోవచ్చు. వేడినీటిని సేవించడం ఎంతో మంచిది. 
 
గృహోపకరణాలు. టాయిలెట్ పేపర్, షాంపూ, టూత్‌పేస్ట్, హ్యాండ్ సబ్బు, డిష్ వాష్ బార్లను మరిచిపోకూడదు. 30 రోజులకు సరిపడా మందులను ముందే కొనిపెట్టుకోవడం మంచిది. పిల్లల వయస్సును బట్టి, డిజిటల్ థర్మామీటర్, టెంపోరల్ ఆర్టరీ థర్మామీటర్ లేదా ఎలక్ట్రానిక్ ఇయర్ థర్మామీటర్ అవసరం కావచ్చు.
 
ఇక ఫేస్ మాస్క్‌లను నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి అవి అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం వీటిని ఉపయోగించాలి. ఇంకా వైద్యులు వీటిని తప్పక వాడాలి. ఇంకా ఇంట్లో వుంటూ ఆరోగ్యంగా వుండేందుకు యాక్టివిటీలను సిద్ధం చేసుకోవాలి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడుకోనివ్వడం.. గార్డెనింగ్ చేయించడం మరిచిపోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.