సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (16:34 IST)

తబ్లీగి వర్కర్లు జుగుప్సాకర పనులు, క్వారంటైన్లలోనే బహిరంగ మలమూత్ర విసర్జన

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా భావిస్తున్న తబ్లీగి జామాత్ వర్కర్లు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏమాత్రం సహకరించడం లేదు. పైగా ఈ వైరస్ సోకిన వారిని క్వారంటైన్లలో ఉంచారు. అక్కడ కూడా వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే సంఘటనలు అనేకం వస్తున్నాయి. 
 
ప్రధానంగా క్వారంటైన్‌, ఐసోలేషన్‌ సెంటర్లలో విధుల్లో మహిళా పోలీసులు, నర్సుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. నగ్నంగా తిరిగేందుకు ప్రయత్నించారు. వైద్య, శానిటేషన్‌ సిబ్బందిపై కూడా వారు ఉమ్మేందుకు యత్నించారు. ఇవన్నీ ఒకేత్తు అయితే.. అత్యంత దారుణంగా పనికిమాలిన చర్యకు పాల్పడ్డారు. క్వారంటైన్‌ సెంటర్‌ వెలుపల బహిరంగ మలవిసర్జన చేశారు. 
 
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ భవన్‌లో దాగివున్న జమాత్‌ సభ్యులను వివిధ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించిన విషయం విదితమే. ఢిల్లీ నరేలాలో ఉన్న ఓ క్వారంటైన్‌ సెంటర్‌లోని రూమ్‌ నంబర్‌ 212లో జమాత్‌ సభ్యులు మహమ్మద్‌ ఫహద్‌(25), ఆద్నాం జహీర్‌(18) ఉన్నారు. వీరు ఉంటున్న రూం బయట బహిరంగ మలవిసర్జన చేశారు. దీన్ని గమనించిన శానిటేషన్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురైంది. 
 
ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తక్షణమే ఆ ప్రాంతాన్ని సిబ్బంది పరిశుభ్రంగా చేశారు. బహిరంగ మలవిసర్జనకు ఫహద్‌, జహీర్‌ పాల్పడి ఉంటారని క్వారంటైన్‌ సిబ్బంది, పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఇద్దరు ఇటీవలే వైద్యులు, ఇతర సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.