శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:46 IST)

కరోనా కల్లోలంలోనూ రష్మిక మందన్న అంటే నాకు క్రష్ అంటూ ట్వీట్ చేసిన హీరో

కరోనా వైరస్ కల్లోలంతో భారత సినీ ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయింది. ఎక్కడ సినిమాలు అక్కడే ఆగిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ కరోనా వైరస్ ఎప్పుడు వదులుతుందో ఏమోనని అంతా అలా చూస్తూ వున్నారు. ఐతే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మాత్రం సినీ నటులు కాస్త యాక్టివ్‌గా వుంటున్నారు.
 
కత్రినా కైఫ్ ఆమధ్య ఇల్లు ఊడుస్తూన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సల్మాన్ ఖాన్ తన గుర్రానికి గడ్డి తినిపిస్తూ కనిపించాడు. తమన్నా తన ముఖానికి అరటికాయ ఫేస్ మాస్క్ వేసుకుంటూ ఆ వీడియోను యూట్యూబులో పెట్టేసింది. ఇలా ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. 
 
యంగ్ హీరోహీరోయిన్లయితే ఫ్యాన్సుతో చాటింగ్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా తమిళ బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన వర్థమాన హీరో హరీష్ కళ్యాణ్ తో అతడి అభిమానులు ట్విట్టర్లో చాట్ చేస్తూ వున్నారు. ఈ సమయంలో ఓ అభిమాని మీకు ఏ హీరోయిన్ అంటే క్రష్ అని అడిగాడు. దీనికి ఆ యంగ్ హీరో ఎంతమాత్రం తడుముకోకుండా తనకు రష్మిక మందన్న అంటే పిచ్చ అభిమానం. ఆమెపై క్రష్ వుంది అని రిప్లై ఇవ్వడమే కాకుండా ఆ ట్వీటుకి రష్మికను ట్యాగ్ చేస్తూ పంపించాడు. మరి దీన్ని రష్మిక చూసి ఏమైనా స్పందిస్తుందా?
 
ఆ.... ఎలా స్పందిస్తుందీ. ఆమెకు ఈ ట్విట్టర్ చూసే టైం కూడా లేదనుకుంటా. ఎందుకంటే ఆమె అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రంలోను, ఇంకా రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఆమె వీటిని చూస్తుందా అని.