గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (21:27 IST)

రష్మిక లెగ్ బాగుంది... ఎక్కడ పెడితే అక్కడ అంతే...

టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అంటే.. రష్మిక పేరే వినిపిస్తోంది. ఈ అమ్మడు ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతో సక్సస్ సాధించి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసి బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకుంది.

వరసగా విజయాలు సాధించడంతో నాగ్ - నాని కాంబినేషన్లో రూపొందిన దేవదాస్ సినిమాలో నటించి మరో విజయం సాధించింది. ఇలా... వరుసగా సక్సస్ సాధించడం.. తన అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే ప్రేక్షక హృదయాలను దోచుకుంది ఈ అమ్మడు.
 
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో డ్యాన్స్ అదరగొట్టేసిందనే పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నితిన్‌తో చేసిన భీష్మ సినిమాతో కూడా విజయం సాధించింది. ఇలా వరుసగా సక్సస్ సాధించడంతో రష్మికకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. 
 
ఇదిలా ఉంటే.. ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ అమ్ముడు టాలీవుడ్లో ఆ.. ముగ్గురు మనసులు దోచుకుంది. ఇంతకీ ఎవరా ఆ.. ముగ్గురు అంటారా..? ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. మహేష్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ... ఛలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా వెళ్లాను. ఆ ఫంక్షన్లో రష్మిక కనిపించింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన గీత గోవిందం సినిమా ఫంక్షన్‌కి వెళితే.. ఆ ఫంక్షన్‌లోనూ రష్మిక కనిపించింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్‌కి వస్తే.. ఈ ఫంక్షన్ లోనూ రష్మిక కనిపించింది. 
 
పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటిస్తుంది అంటూ రష్మికను అభినందించారు మెగాస్టార్. ఇక భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రష్మిక ఆల్రెడీ సక్సస్‌లో ఉంది. సరిలేరు నీకెవ్వరుతో మరో సక్సస్ సాధించింది. తర్వాత భీష్మతో కూడా సక్సస్ సాధిస్తుంది. ఈ సక్సస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ రష్మికను అభినందించారు త్రివిక్రమ్. 
 
ఇక భీష్మ సక్సస్ మీట్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ... రష్మిక లెగ్ బాగుంది. ఎక్కడ పెడితే అక్కడ సూపర్ హిట్స్ వస్తున్నాయి. మొన్న మాకు సరిలేరు నీకెవ్వరు సినిమా ఇచ్చింది. ఇప్పుడు భీష్మ.. ఆమెలో ఎక్స్‌ట్రార్డినరీ ఎనర్జీ ఉంది. సరిలేరు నీకెవ్వరులో కానీ.. ఈ సినిమాలో కానీ డ్యాన్స్‌లు సూపర్బ్‌గా చేస్తుంది. హీరోలతో పోటీపడుతూ డ్యాన్స్ చేసింది అంటూ రష్మికని అభినందించారు దిల్ రాజు.
 
 ఇలా.. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల అభినందనలు అందుకుంది ఈ క్రేజీ హీరోయిన్ రష్మిక. వరుస విజయలతో దూసుకెళుతున్న ఈ అమ్మడు భవిష్యత్‌లో మరిన్ని సక్సస్‌లు సాధిస్తుందని ఆశిద్దాం.