సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (14:44 IST)

చిరు సినిమా రిలీజ్‌కి ముహుర్తం ఫిక్స్, చిత్రంలో మహేష్ బాబు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ ప్రెస్టేజీయస్ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి చిరు అభిమానులు క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే.. కొరటాల శివ ఇప్పటివరకు ఫ్లాప్ అనేది తెలియకుండా వరుసగా బ్లాక్‌బస్టర్ మూవీస్ అందిస్తున్నారు. దీంతో చిరుతో ఎలాంటి సినిమా తీయనున్నారు. ఆయన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేసారనేది ఆసక్తిగా మారింది.
 
ఈ సినిమాలో చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే... చరణ్‌ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో ఉండడం వలన మే నెలాఖరు తర్వాత చరణ్‌‌తో షూటింగ్ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే... చరణ్‌ తో కీలక పాత్ర చేయించినప్పటికీ.. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాతే రిలీజ్ చేయాలని.. రాజమౌళి ముందుగానే కండీషన్ పెట్టారని తెలిసింది. దీంతో చిరంజీవి, కొరటాల ఆలోచనలో పడ్డారని టాక్. అందుకనే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయమై.. సస్పెన్స్ నడుస్తుంది. 
 
ఆర్ఆర్ఆర్ తర్వాత అంటే.. 2021 సమ్మర్లో రిలీజ్ చేయాలి. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాని అప్పటివరకు రిలీజ్ కాకుండా ఉంచడం కరెక్ట్ కాదని చిత్ర యూనిట్ ఆలోచనలో పడింది. చరణ్‌ పాత్రను అల్లు అర్జున్‌తో కానీ, మహేష్‌తో కానీ చేయిస్తే రిలీజ్ డేట్ ప్రాబ్లమ్ ఉండదు. అందుకనే మహేష్ బాబుని కాంటాక్ట్ చేసారని టాక్ వచ్చింది. నెక్ట్స్ వీక్ ఈ విషయంపై మరింతగా క్లారిటీ వస్తుందని సమాచారం. 
 
అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొత్తగా ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న రిలీజ్ చేయాలనుకుంటున్నారని. ప్రస్తుతం షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. ఇటీవలే రాజమండ్రిలో చిరంజీవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
 
ఈ క్రేజీ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రెజీనా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటిస్తుంది. ఆల్రెడీ చిరంజీవి, రెజీనాపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం జరిగింది. అందర్నీ ఆలోచింప చేసే సందేశంతో పాటు మంచి వినోదం కూడా ఉంటుందని తెలిసింది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ సినిమా చిరు పుట్టినరోజు నాడు రిలీజ్ అయితే.. మెగా ఫ్యాన్స్‌కి పండగే.