శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (14:31 IST)

సితారతో మహేష్ బాబు.. నిద్రించేందుకు ముందు ఇలా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార.. సోషల్ మీడియాలో స్టార్. ఆమె ఏం చేసినా.. అది వైరల్ అయిపోయింది. ఆమె ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
ఇటీవల సితార సరిలేరు నీకెవ్వరు సినిమాలోని 'డ్యాంగ్ డ్యాంగ్' పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ్యాన్స్  చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ భార్య, సినీనటి నమ్రత.. పోస్ట్ చేసిన ఓ ఫొటో అభిమానులను అబ్బుర పరుస్తోంది. 
 
నిద్రపోయే ముందు తన తండ్రికి కబుర్లు చెబుతూ, చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని, నవ్వుతూ సితార కనపడుతోంది. ఆమె చెబుతోన్న విశేషాలను వింటూ మహేశ్ బాబు కూడా చిరునవ్వులు చిందించాడు. ఈ ఫోటోకు మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.