గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (11:59 IST)

త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో సమంత.. రష్మిక అవుట్

''అలవైకుంఠపురంలో'' హిట్ తర్వాత త్రివిక్రమ్ కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ సమ్మర్ తర్వాత మొదలుకానుండగా.. త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబోతున్నారట.
 
అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక స్థానంలో సమంత అక్కినేనిని హీరోయిన్‌గా చిత్ర యూనిట్ తీసుకోనున్నారని తెలుస్తోంది. రష్మిక తాజాగా సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. కాగా.. త్రివిక్రమ్ గత సినిమాలైన అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ.. ఆ.. వంటి చిత్రాల్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాలేదు.