దర్శకులందరినీ ఆ మాట అనేసిన సమంత.. ఏమన్నారు..?

Jaanu
Jaanu
జె| Last Updated: మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:39 IST)
జాను సినిమా విమర్శకుల నోళ్ళు మూయించింది. ఆ క్యారెక్టర్ నేను చేయలేను.. అసలు జానులో సమంత క్యారెక్టర్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చదని షూటింగ్ సమయంలోనే కొంతమంది నాపై విమర్శలు చేశారు. సినిమా పూర్తయిన తరువాత.. నేను సినిమాను చూశాను. అద్భుతంగా వచ్చింది.

ఈ సినిమాను అందరూ ఆదరిస్తానని నమ్మాను. అదే జరిగింది. విమర్శకులు ఒక్కసారిగా నోళ్ళను మూసేశారు. ఇప్పుడు నేను ఎలాంటి క్యారెక్టర్ నైనా చేయగలనన్న నమ్మకం నాలోనే కలిగింది అంటోంది సమంత. తనపై కావాలనే పనిగట్టుకుని కొంతమంది విమర్శలు చేస్తున్నారని.. అది తనకు ఏ మాత్రం నచ్చలేదంటోంది సమంత.

విమర్శలు ఉండాలి.. కానీ అది పరిధిని దాటకూడదు. ఆ పరిధిని దాటి కొంతమంది మాట్లాడుతున్నారు. అది కూడా దర్శకులే. నేను వారు వీరు అని పేర్లు చెప్పను. కానీ దర్శకులు నన్ను కలిసినప్పుడు ఒక స్టోరీ చెబుతారు. ఆ స్టోరీ నాకు నచ్చితే సినిమాను ఒప్పుకుంటాను.

కానీ సినిమా ప్రారంభమైన తరువాత స్క్రిప్ట్‌కు, చేసే సినిమాకు అస్సలు పొంతనే ఉండదు. ఇలా చాలామంది దర్శకులను నేను చూశాను. అందులో ఒకటి రంగస్థలం సినిమా అంటోంది సమంత. దర్సకులలో చాలామంది ఇలాగే ఉంటారంటోంది సమంత.దీనిపై మరింత చదవండి :