శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:56 IST)

లవ్‌స్టోరీ తర్వాత నాగేశ్వరరావుతో రష్మిక మందన?

ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా ''నాగేశ్వ‌ర‌రావు'' అనే చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇందులో క‌థానాయిక‌గా ర‌ష్మిక మంద‌న్న‌ని ఎంపిక చేసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప‌ర‌శురామ్ నిర్ణ‌యం మేర‌కే ర‌ష్మికని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ''గీత గోవిందం''తో ర‌ష్మిక‌కి తిరుగులేని హిట్ ఇచ్చాడు ప‌ర‌శురామ్‌. 
 
అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండించ‌డంలో ప‌ర‌శురామ్ విజ‌య‌వంత‌మ‌య్యారు. ''గీత గోవిందం'' త‌ర్వాతే ర‌ష్మిక కెరీర్ తెలుగులో ఊపందుకుంది. అందుకే ఆమె బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, బోలెడ‌న్ని అవ‌కాశాలు చేతిలో ఉన్న‌ప్ప‌టికీ ప‌ర‌శురామ్ కోరిక మేర‌కు వెంట‌నే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింద‌ట‌. 
 
ప్ర‌స్తుతం చైతూ న‌టిస్తున్న ''ల‌వ్‌స్టోరీ'' పూర్త‌వ్వ‌గానే ''నాగేశ్వ‌ర‌రావు'' సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ని స‌మాచారం. అలాగే రష్మిక మందన ప్రస్తుతం భీష్మ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తోంది. ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. తర్వాత కోలీవుడ్ సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూనే తాజా సినిమాలో నటిస్తుందని టాక్.