భీష్మ ట్రైలర్ వీడియో.. సూపర్ అంశాన్ని టచ్ చేశాడుగా? (Video)
Bheeshma Trailer
ఇకపోతే, భీష్మ ఈ నెల 21వ తేదీన మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్‌లో బలవంతుడితో గెలవొచ్చు, అదృష్టవంతుడితో గెలవలేవు అంటూ విలన్ హీరోకి వార్నింగ్ ఇస్తాడు.
మరి అదృష్టవంతుడితో నితిన్ ఎలా గెలిచాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే. అంతేకాకుండా ప్రస్తుతం విడుదలైన భీష్మ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే 3 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. ఇంకేముంది...? భీష్మ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.
