సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (16:51 IST)

రష్మిక మందన్న చేసిన పనికి అవాక్కయిన ఫ్యాన్స్

రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల జాబితాలో వుంది. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అందుకే దర్శకనిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. ఇటీవలే మహేష్ బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక ఆనందంలో ఊగిపోతుంది.

తాజాగా అల వైకుంఠపురములో చిత్రంలో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. ఈ ఆనందంతోనే ఏమోగానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చేతులు తిప్పుతూ అదో రకంగా ప్రవర్తించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన కొంతమంది రష్మికకి బాగా ఎక్కింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.