రెజీనా, నివేదా థామస్ శాకిని డాకిని ఫస్ట్ లుక్
Regina, Niveda Thomas
నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. నేడు రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజానీ, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లు ఇద్దరూ కూడా మొదటిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు.
మిస్ గ్రానీ సినిమా యూనివర్సల్ కథ కావడంతో ఓ బేబీగా రీమేక్ చేయడంతో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిడ్ నైట్ రన్నర్స్ కథ కూడా గ్లోబల్ అప్పిల్ ఉంటుంది. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథే...
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.
ఈ చిత్రానికి రచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు.
తర్వాతి కథనం
