సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (17:44 IST)

రెజీనా క‌సాండ్ర - బ్రేకింగ్ న్యూస్ ప్రారంభం

Rejena and others
రెజీనా క‌సాండ్ర‌, సుబ్బ‌రాజు, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’ . సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది.  
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘సోష‌ల్ సెటైరిక‌ల్‌గా ప్ర‌స్తుత కాల‌మాన ప‌రిస్థితుల‌పై వాస్త‌విక కోణంలో.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా డైరెక్ట‌ర్ సుబ్బు వేదుల ‘బ్రేకింగ్ న్యూస్’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సోమ‌వారం నుంచిప్రారంభ‌మైన షూటింగ్‌ డిసెంబ‌ర్ మూడో వారం వ‌ర‌కు కొనసాగుతుంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను చేస్తున్నాం. వైవిధ్య‌మైన క‌థ‌నంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం’’ అన్నారు. 
 
ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు వేదుల‌,  క‌థ‌, మాట‌లు:  బి.వి.ఎస్‌.ర‌వి,  స్క్రీన్ ప్లే :  క‌ళ్యాణ్ వ‌ర్మ‌, వంశీ బ‌ల‌ప‌నూరి, సుబ్బు వేదుల‌, సందీప్ గాదె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ :  కౌముది నేమ‌ని, సినిమాటోగ్ర‌ఫీ :  ఈశ్వ‌ర్‌ ఎలుమహంటి, ఎడిట‌ర్ :  వ‌ర ప్ర‌సాద్‌,  సంగీతం : ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఆర్ట్‌:  ష‌ర్మిల చౌద‌రి