శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (10:06 IST)

రష్మి అందాలకు దర్శకుడు ఫిదా... తొడలు బాగా అట్రాక్ట్ చేశాయట...

అందాలున్నవి ఆరబోయడానికే, సోయగాలున్నవి సొంపుగా ప్రదర్శించడానికే అంటున్నారు కొందరు భామలు. అంతేనా ప్రతి ఒక్కరిని తమ వైపుకు తిప్పుకుంటూ ఉంటారు. అలాంటి భామల్లో 'జబర్దస్త్' బ్యూటీ రష్మి గౌతమ్ ముందు వరుసలో ఉ

అందాలున్నవి ఆరబోయడానికే, సోయగాలున్నవి సొంపుగా ప్రదర్శించడానికే అంటున్నారు కొందరు భామలు. అంతేనా ప్రతి ఒక్కరిని తమ వైపుకు తిప్పుకుంటూ ఉంటారు. అలాంటి భామల్లో 'జబర్దస్త్' బ్యూటీ రష్మి గౌతమ్ ముందు వరుసలో ఉంటుంది. ఉన్నవి చూపించడంలో తప్పేంటి? అంటూ 'అంతకు మించి' అనే సినిమాలో అందాలను ఆరబోసింది. ఇపుడు ఈ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అందాల గురించి మాట్లాడుకుందాం.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అందాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. 'జబర్దస్త్' కామెడీ షోతో రష్మి హాట్ భామగా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నా.. అంతకుముందే ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించింది. కానీ అప్పట్లో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. 
 
క్రేజీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే 'గుంటూరు టాకీస్', 'అంతం', 'తను వచ్చెనంట', 'చారుశీల', 'నెక్స్ట్ నువ్వే' వంటి చిత్రాల్ల గ్లామరస్‌గా రెచ్చిపోయింది. ముఖ్యంగా 'గుంటూరు టాకీస్'లో అయితే.. కుర్రకారును ఓ రేంజ్‌లో పిచ్చెక్కించింది. తాజాగా 'అంతకు మించి' అంటూ మరింత హాట్‌గా కైపెక్కించింది రష్మి.
 
రష్మి లీడ్ రోల్‌లో తెరకెక్కిన తాజాచిత్రం 'అంతకు మించి'. ఈ చిత్రాన్ని రష్మి అందాలనే పెట్టుబడిగా పెట్టి తెరకెక్కించారు. టైటిల్‌కి తగ్గట్టుగానే ఇంతకు ముందెన్నడూ చూడని రష్మి ఈ మూవీలో కనిపిస్తోంది. ఉల్లిపొరలాంటి తెల్లటి దుస్తుల్లో అమ్మడు తన తొడలను భేషుగ్గా బయటపెట్టేసి 'అంతకు మించి' అంటే ఇదే అంటూ చిన్న శాంపిల్ వదిలింది. 
 
దాంతో 'ఆర్‌ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి... రష్మి తొడలపై హాట్ కామెంట్స్ చేశాడు. ఆమె గ్లామర్‌కి ఫిదా అయ్యానని.. ముఖ్యంగా రష్మి థైస్ తనను బాగా అట్రాక్ట్ చేశాయంటూ మనసుపారేసుకున్నాడు. దీంతో రష్మి ఇమేజ్‌కు ఆమె గ్లామర్ తోడు కావడంతో 'అంతకు మించి' సినిమాకు మంచి హైప్ వచ్చింది. మరి ఈ సినిమా రష్మికి నిజంగా 'అంతకు మించి' క్రేజ్ తెస్తుందో లేదో వేచిచూడాల్సిందే.