1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sailaja Reddy Alludu Confirmed For August 31

పొగరుబోతు భార్యను చైతూ దారికి తెచ్చుకుంటాడా?

నాగచైతన్య హీరోగా ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది. ఆగస్టు 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో ర

Sailaja Reddy Alludu
నాగచైతన్య హీరోగా ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది. ఆగస్టు 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 
అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, చైతూకు అత్తమ్మగా రమ్యకృష్ణ కనిపించనుంది. పొగరుబోతు భార్య .. ఆమెను వెనకేసుకొచ్చే అత్తగారు .. ఆ ఇద్దరినీ దారికి తెచ్చే అల్లుడిగా చైతూ నటిస్తున్నాడు. గతంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చినా, ఈ కథలో వెరైటీ కథాంశంతో తెరకెక్కనుందని సినీ యూనిట్ వర్గాలు తెలిపాయి. 
 
ఇకపోతే.. నాగ చైతన్య, తమన్నాలపై చిత్రీకరించనున్న ''నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయతు'' సాంగ్ రీమిక్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ జనం అంటున్నారు.
తర్వాతి కథనం
రూ.125 కోట్లతో సినిమా తీశారు.. రూ.6.20 కోట్లు అప్పు చెల్లించలేరా? రజినీ భార్యకు సుప్రీం చీవాట్లు