మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: సోమవారం, 25 జూన్ 2018 (20:31 IST)

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎ.ఎన్.ఆర్ ఎవ‌రు..?

ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే అందులో ఖ‌చ్చితంగా ఎ.ఎన్.ఆర్ ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తేజ డైరెక్ష‌న్లో మూవీ అనుకున్న‌ప్పుడు ఎ.ఎన్.ఆర్ పాత్ర నిడివి చాలా త‌క్కువుగా ఉండేద‌ట‌. క్రిష్ వ‌చ్చిన త‌ర్వాత ఎ.ఎన్.ఆర్ పాత్ర నిడివి పెంచార‌ట‌. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే అందులో ఖ‌చ్చితంగా ఎ.ఎన్.ఆర్ ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తేజ డైరెక్ష‌న్లో మూవీ అనుకున్న‌ప్పుడు ఎ.ఎన్.ఆర్ పాత్ర నిడివి చాలా త‌క్కువుగా ఉండేద‌ట‌. క్రిష్ వ‌చ్చిన త‌ర్వాత ఎ.ఎన్.ఆర్ పాత్ర నిడివి పెంచార‌ట‌. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎ.ఎన్.ఆర్ పాత్ర‌ను ఎవ‌రు పోషించ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్రకారం.. అక్కినేని పాత్ర‌ను పోషించ‌మ‌ని నాగ‌చైత‌న్య‌ను క్రిష్ అడిగాడ‌ట‌. 
 
ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమాలో చైత‌న్య అక్కినేనిగా అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా ఫాస్ట్‌గా జ‌రుగుతోంది. జులై ఫ‌స్ట్ వీక్‌లో షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేని పాత్ర పోషించేందుకు చైతు ఎస్ అంటాడో నో అంటాడో చూడాలి. ఐనా బాలయ్య ఎన్టీఆర్ పాత్ర చేస్తే నాగచైతన్య ఏఎన్నార్ అంటే జనం ఒప్పుకుంటారా? ఏమో?