బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 25 జూన్ 2018 (20:16 IST)

సంతోషం కొద్దిసేపే ఉండాలి... ఎక్కువైతే ఏమవుతోందో తెలుసా? సమంత

ఒక సినిమా హిట్టయినా.. హిట్టయిన సినిమాలో మన క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చినా.. ఆ హీరోయిన్‌ను మించిన వారు ఎవరూ లేరని ప్రచారం జరిగినా అన్నింటిని మురిసిపోకూడదు. నా ఉద్దేశం సంతోషం అనేది కొద్దిసేపే ఉండాలి. మన సినిమా హిట్టయ్యింది. నాకు మంచి పేరు వచ్చింది. అ

ఒక సినిమా హిట్టయినా.. హిట్టయిన సినిమాలో మన క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చినా.. ఆ హీరోయిన్‌ను మించిన వారు ఎవరూ లేరని ప్రచారం జరిగినా అన్నింటిని మురిసిపోకూడదు. నా ఉద్దేశం సంతోషం అనేది కొద్దిసేపే ఉండాలి. మన సినిమా హిట్టయ్యింది. నాకు మంచి పేరు వచ్చింది. అని కొద్దిసేపు అనుకుని తరువాత వదిలెయ్యాలి. అంతేగానీ సంతోషంలో మునిగితేలుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అంటోంది సమంత. 
 
సంతోషం చివరలో విషాదానికి కూడా కారణమవుతుంది. నా విషయంలో అలాంటి సంఘటనలో కొన్ని సందర్భాల్లో జరిగాయంటోంది సమంత. ఏదైనా విషయంలో ఎక్కువసేపు సంతోషపడితే ఆ మరుసటిరోజు నా జీవితంలో విషాదం ఎదురవుతుంది. అందుకే నేను నా స్నేహితులు చాలామందికి చెబుతుంటాను. సంతోషమైనా, బాధ అయినా ఏదైనా సరే త్వరగా మరిచిపోయేందుకు ప్రయత్నించాలి. ఎప్పుడూ సాధారణంగా ఉండాలే తప్ప ఆనందం వస్తే తెగ మురిసిపోవడం, బాధ వస్తే రోజంతా బాధపడుతూ కూర్చోకూడదంటోంది హీరోయిన్ సమంత.