ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (13:26 IST)

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో నేను నటించను... చైతు షాక్... మరి ఎవరు నటిస్తున్నారు?

ఎన్టీఆర్ బ‌యోపిక్ జులై 5న సెట్స్ పైకి రానుంది. ఈ లోపు రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. క్రిష్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ నిలిచిపోయేలా క‌థ‌ను సిద్ధం చేసార‌ట‌. అయితే... ఎన్టీఆర

ఎన్టీఆర్ బ‌యోపిక్ జులై 5న సెట్స్ పైకి రానుంది. ఈ లోపు రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. క్రిష్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ నిలిచిపోయేలా క‌థ‌ను సిద్ధం చేసార‌ట‌. అయితే... ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర అంటే అందులో అక్కినేని ఉండాల్సిందే. అక్కినేని పాత్ర కోసం క్రిష్ చాలా కేర్ తీసుకుంటున్నార‌ట‌. ఈ పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టించ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.
 
కానీ... ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ట‌. చైతును అడిగితే... అదంతా ఉత్తుత్తిదే అని చెప్పాడట. ఇకపోతే తాజాగా వ‌చ్చిన వార్త ఏంటంటే... అక్కినేని ఫ్యామిలీలోనే వేరే హీరో ఆ పాత్ర‌ను పోషిస్తార‌ట‌. మ‌రి... చైత‌న్య కాక‌పోతే అక్కినేని పాత్ర పోషించే ఆ హీరో ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు అక్కినేని పాత్ర‌ను ఓ కొత్త ఆర్టిస్టుతో న‌టింప‌చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రి... ఫైన‌ల్‌గా అక్కినేని పాత్ర‌ను ఎవ‌ర్ని వ‌రిస్తుందో చూడాలి.