1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Samantha's Shaakuntalam makes its OTT debut

ఓటీటీలోకి శాకుంతలం.. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్

Dev, samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. 
 
దీంతో విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి ఈ నెల 12న అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఒక రోజు ముందుగానే మే 11న ఓటీటీలోకి రిలీజ్ చేశారు. 
 
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా అందుబాటులో ఉంది. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌.. దుష్యంతుడి పాత్ర పోషించగా, సమంత శకుంతలగా నటించింది. 
తర్వాతి కథనం
ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్‌పై పూనమ్ కౌర్ ఫైర్..