బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 11 మే 2023 (17:23 IST)

అయ్యో నాగ చైతన్య ఇలా ఉన్నాడేంటి , సమంత ఆలోచనలా. ?

Naga Chaitanya
Naga Chaitanya
ఇప్పడు నాగ చైతన్య ఎలా ఉన్నాడో చూసారు కదా.. చాలా సన్నగా చిక్కినట్లు  ఉన్నాడు. ఆయన చేసిన కస్టడీ సినిమా రేపు విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ్ లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ లో పలు చోట్ల తిరిగారు. ఒక్కసారి ఇలా ఎలా అయ్యేరేమిటి అంటే.. చైతు మాట్లాడుతూ, రెండు భాషల్లో విడుదల చేయడంతో తిరుగుడు ఎక్కువయింది. డబ్బింగ్ కూడా రెండు  భాషల్లో చెప్పడంతో అలసి పోయాను అని అన్నారు. 
 
మరి పాన్ ఇండియా మూవీ అయితే పరిస్థితి ఏమిటి? అన్న దానికి.. దానికి తగినట్లు ఏర్పాట్లు ఉంటాయని సమాధానం చెప్పారు. మీరు ఎక్కడకు వెళ్లినా సమంత విషయమే ముందుకు వస్తుంది. అని అడిగితే నేను ఆ విషయంలో క్లారిటీ చెప్పేసాను. అయినా సోషల్ మీడియాలో ఏదోఏదో రాస్తున్నారు. అది వారికే వదిలేస్తున్నాను. ప్రజలు ఏది నిజం, అబద్దం అనేది తెలిసుకున్నారు. ఇంకా వార్తలు వస్తుంటే నవ్వు వస్తుంది. అని తెలిపారు.