చిరంజీవి గాడ్ ఫాదర్ నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్
Satyadev
ఈరోజు ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో సత్యదేవ్, జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్.
ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే నయనతార ఫస్ట్ లుక్ విడుదలైయింది. సత్యప్రియ జైదేవ్ గా నయనతార ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జైదేవ్ గా సత్యదేవ్ ఫస్ట్ లుక్ కూడా క్యూరియాసిటీని పెంచింది.
ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.
గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు
పీఆర్వో: వంశీ-శేఖర్
