గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (17:28 IST)

శేఖ‌ర్‌ చిత్రం మే20న విడుద‌ల‌

Sekar date poster
Sekar date poster
డా. రాజ‌శేఖ‌ర్ న‌టించిన 91వ చిత్రం `శేఖ‌ర్‌`. జీవితా రాజశేఖర్ దర్శక‌త్వం వ‌హించారు.  క‌థ ప్ర‌కారం రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ను శ‌నివారంనాడు విలేక‌రుల స‌మావేశంలో విడుద‌ల చేశారు. మే 20న ఈ చిత్రం విడుద‌కానున్న‌ట్లు జీవితా రాజ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు. 
 
ఈ సంద‌ర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ,  మాకెంతో స‌హ‌క‌రించిన నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ఈ చిత్రం. ప్రతి ఒక్కరి హృద‌యాల‌ను ట‌చ్ చేస్తుంది. కోవిడ్ వ‌ల్ల ప్ర‌తి కుటుంబం చాలా స‌ఫ‌ర్ అయిన ఎమోష‌న్స్‌ను ఈ చిత్రంలో చూస్తారు. రాజ‌శేఖ‌ర్‌గారు న‌టించిన  గోరింటాకు, అక్కమొగుడు,మా అన్నయ్య, సింహారాశి వంటి ఎన్నో చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరించారు. ఇప్పుడు రాబోయే `శేఖ‌ర్‌` చిత్రం కూడా ఆయ‌న స్థాయిని పెంచేలా వుంటుంది. ఈ శేఖర్ సినిమా అనుకున్న టైంలో పూర్తి కావడానికి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది కృషి ఎంతో వుంది.  రాజ‌శేఖ‌ర్‌గారు కొత్త సినిమా లుక్ ప‌నిమీద వుండ‌డం వ‌ల్ల రాలేక‌పోయారు. త్వ‌ర‌లో ఆ సినిమా వివ‌రాలు కూడా తెలియ‌జేస్తాం అన్నారు.
 
చిత్ర నిర్మాతల్లో ఒకరైన  వెంకట శ్రీనివాస్ బొగ్గరం  మాట్లాడుతూ. ,గరుడవేగ, కల్కి వంటి  హిట్ సినిమాలు చేసిన తరువాత మేం ఒక సినిమా చూశాం.  ఆ సినిమాను తెలుగులో చెయ్యాలనుకుంటున్నామ‌ని జీవితాగారు చెప్పిన‌ప్పుడు నా పార్టర్ బీరం సుధాకర్ తో క‌లిసి నిర్మించాం. రాజ‌శేఖ‌ర్‌గారి భిన్న‌మైన గెట‌ప్‌తోపాటు  ఎమోషన్, యాక్షన్,సెంటిమెంట్ ఉన్న మంచి సినిమా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రాజశేఖర్ గారు  సినిమాకు ఎంతో ప్రాణం పెట్టి పని చేశారు.  ఈ సినిమా చూసిన ముత్యాల రాందాస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తానని ముందుకు వ‌చ్చినందుకు ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.
 
ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. నాకు రాజశేఖర్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పటివరకు చూడనటువంటి రాజశేఖర్ ఆహార్యం చూసి ఈ సినిమా బాగుంటుందనే నమ్మకంతో సినిమాను చూపించమని అడిగాను. జీవిత, నిర్మాతలు ఈ సినిమాను చూపించారు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో మే 20 న  విడుదల చేస్తున్నాను అన్నారు.
 
నటుడు సమీర్ మాట్లాడుతూ..ఈ సినిమాలో ప్రాధాన్య‌మైన పాత్ర‌లో న‌టించాను. రాజశేఖర్ గారంటే యాంగ్రీ యుంగ్ మ్యాన్ అంటారు. కానీ సెట్ లో అంద‌రితో చాలా జాలీగా ఉండేవారు. నా కెరీర్లో ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా ఇది. జీవితగారు ద‌ర్శ‌కురాలిగా అన్నీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. రాజశేఖర్ గెటప్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. దాంతో ఈ సినిమా 50% సక్సెస్ సాధించింది. తనెంత కష్టపడ్డాడో తన వర్క్ ఏంటో ఈ సినిమా ద్వారా కనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్  ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్లింది. ఇప్పటి వరకు నేను చూసిన రాజశేఖర్ గారి సినిమాలలో   బెస్ట్ అవుతుంది.  నేను కూడా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు  చూస్తున్నాన‌ని అన్నారు.
 
నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ.. జీవితగారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. రాజశేఖర్ గారితో న‌టించ‌డం మొద‌టిసారి. తను చేసే కొన్ని సీన్స్ కు మేమే కనెక్ట్ అవ్వడంతో మాకే తెలియకుండా మా కళ్ళలో నీళ్లు వచ్చేవి. రాజశేఖర్ గారు అంత అద్భుతంగా నటించారు. వారితో వర్క్ చేయడం మాకు వండర్ఫుల్ జర్నీ.అనూప్ గారు తన పాటలతో సినిమాకు ప్రాణం పోశారు. అన్ని పాటలు చాలా అల్టిమేట్ గా ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు మేం చేసిన అల్లరి చూసి చాలా ఎంజాయ్ చేస్తారు..ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ  చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను అన్నారు.
 
నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఫుల్ ఎమోషన్ జర్నీ చేసిన సినిమా"శేఖర్".ఇప్పటివరకు రాజశేఖర్ గారి గురించి విన్నానే తప్ప చూడలేదు. అటువంటిది వారితో నటించినదుకు చాలా ఆనందంగా ఉంది.ఇందులో రాజశేఖర్ గారి గెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది..రాజశేఖర్ గారు ప్రతి రోజు సెట్ లో అందరినీ నవ్వించేవారు. నా కెరీర్లో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇదే అవుతుంది. జీవిత గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ న‌ట‌న రాబ‌ట్టుకున్నారు. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. ఏమోషన్ తో అటాచ్ అయిన యాక్షన్ ఇందులో ఉంటుంది. రాజశేఖర్ గారికి  బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు.
 
కెమెరామెన్ మల్లికార్జున్ నరగని మాట్లాడుతూ.. జీవిత గారు నాపై ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టారు. నేను ఇంత పెద్ద సినిమా చేస్తానని జీవితంలో కూడా అనుకోలేదు.ఈ క్రెడిట్ అంతా జీవితా రాజశేఖర్ గారికే చెందుతుందన్నారు.