గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (10:50 IST)

రాజశేఖర్ దంపతులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు

Rajasekar
సినీనటుడు రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుంచి రూ.26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా జీవిత, రాజశేఖర్‌లపై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిందని కూడా జోష్టర్ ఫిలం సర్వీసెస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు వెల్లడించారు. 
 
ఈ ఆరోపణలపై జీవిత స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదన్నారు. శనివారం ప్రెస్ మీట్ పెడతామని.. అన్నీ వివరాలు చెప్తానని తెలిపారు. 
 
పూర్తి ఆధారాలు మీడియా ముందుకు తీసుకువస్తానని, అప్పటివరకు దీనిపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శేఖర్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.