శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్

ఆర్కే. సెల్వమణికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Selvamani-Roja
ఏపీలోని అధికార వైకాపా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త, సినీ దర్శకుడు ఆర్.కె.సెల్వమణికి చెన్నై జార్జిటౌన్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. 2016లో ప్రముఖ ఫైనాన్షియల్ ముకుంద్ చంద్ర బోత్రాపై ఆర్కే సెల్వమణితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుల్ అన్బరసులు ఓ ఇంటర్వ్యూలో ముకుంద్ చంద్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
దీంతో తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లందని పేర్కొంటూ ముకుంద్ చంద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో అయితే, ఆ తర్వాత ఆయన మరణించారు. దీంతో ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు.
 
ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. అయినప్పటికీ సెల్వమణి, అరుళ్ అన్బరసులు విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, వారి తరపు న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.